మనోయజ్ఞం

19/02/2013 03:14

నూతన నంవత్సర శుభాకాంక్షలతో 2013

మనోయజ్ఞం


డా. సమ్మన్న ఈటల

ప్రభు!
ఈ సృష్టి స్థితి లయల వలయవిన్యాసంలో
అనంత కాల గమనపు విధి వైచిత్రయంలో
గతించి పోయిన జీవులెన్నో!
ఈ జీవికి... ఈ జన్మలోని
జనన మరణాల సందిసంద్యల్లో
భవబంధాలు భవరోగాలు
ప్రియాలు అప్రియాలు
రాగాలు విరాగాలు
సంకల్పాలు వికల్పాలు
సంయోగాలు వియోగాలు
విరహాలు కలహాలు
ప్రణయాలు ప్రళయాలు
సరాగాలు సంవేదనలు
వినోదాలు విషాదాలు
ఆనందాలు ఆవేదనలు
జివనయానంలోని ఆటుపోటులు
ఆకస్మిక కుదుపులు మలుపులు
సమస్త భౌతిక అభౌతిక క్రియలు
భూత వర్తమాన భావిష్యవిపత్తులు
బక్తి వేదాంత వైరాగ్యాలు
అన్నీ నీ అభిష్టంగా సంకల్పంగా నిర్దేశంగా తలంచి
సర్వస్వికారభావనతో సమంగా స్వీకరించి
సర్వసమర్పణ బుద్ధితో నిశ్చల మనస్సుతో
నీ పూజకు పుష్పాలుగా అర్పించనీ!!
ఈ విశ్వచలనంలో నీ నుండి ప్రభవించే శక్తి
పదార్ధంగా, పదార్ధం శక్తిగా ప్రకటితమైనట్లు
నేను జీవుడను, నీవు దేవుడవు అనే గీతల్నిచెరిపేస్తూ
ప్రాణశక్తిని విశ్వశక్తితో భౌతిక పదార్ధాన్ని విశ్వపదార్ధంతో
అనుసంధానం గావిస్తూ అనంతకాలంలో లీనమైపోని !