Inspirational

04/08/2012 17:49

ఆడది అంటే అసలు మన దృష్టిలో ఎవరు ?
మనం పుట్టినప్పటి నుంచి మనని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, మనము అడగక ముందే మన ఆకలి గ్రహించి కడుపు నింపే ఆ తల్లి కుడా ఆడదే కదా...
మనకే సంబంధము లేకపోయినా, పెళ్లి అనే ఒక ప్రక్రియ తో తన వారినందరినీ విడిచి మనమే సర్వస్వము అనుకుని, ఎప్పటికప్పుడు మన అవసరాలు తీరుస్తూ, మన కష్టాన్ని తన కష్టం గా భావి...
ంచే "ఆలి" అనబడే ఆ జీవి కుడా ఆడదే కదా...
తను మనకి శారీరక సుఖాలను పంచి, మన వంశానికి తదుపరి తరం తాలూకు ప్రాణం పోసి చివరికి తల్లయి తరించే తనూ ఆడదే కదా...
అందుకే ఆడదానిని "వసుధారిని" తో పోలుస్తారు.
వసుధారిని అంటే ఇక్కడ మనకి రెండు అర్ధాలు ఒస్తాయి. ఒకటి భుదేవని, మరొకటి అంతస్తుని పంచి పెంచే లక్ష్మి దేవి అని. అందుకే భార్యని గృహలక్ష్మి గా గుర్తించే సంప్రదాయం మనది.
ఇక్కడ భూదేవి తో ఇంకా లక్ష్మి దేవి తో ఎందుకు ఆడదాన్ని పోల్చారంటే, ఓర్పు లో భూదేవిని మించినది లేదు, సంపదలో లక్ష్మి దేవిని మించినది లేదు అని.
సంపద అంటే ఇక్కడ ఆస్తులు, పాస్తులు, సిరిసంపదలని కాదు, స్తితి అని అర్ధం. అంటే మొగవాడి పరువు మర్యాదలు అతడు కట్టుకున్న ఆడదాని ప్రవర్తన మీద ఉంటుందని అర్ధం. అందుకే మన గృహినులను గృహలక్ష్మి తో పోల్చి పిలుచుకుంటాము. తల్లిలా, ఆలిలా, సోదరిలా, బిడ్డలా, ప్రేయసిలా ఇలా ఎన్నో రూపాల్లో దర్సనమిచ్చే ఆ అపురూపమైన జీవి పేరే ఆడది అంటే.
మరి అలాంటి ఆడదాన్ని మాటి మాటికి మనం ఎందుకు కించ పరుస్తున్నాము ?
ఇలా మనమే మన మహిళలను కించపరిస్తే, వారిని మరి గౌరవించేది ఎవరు ? వాళ్ళు అసలు చేసిన పాపమేమిటి ? మనం మనతో తెచ్చుకున్న పున్యమేమిటి ?
"మనకి కనిపించ వచ్చు ఒక విచిత్ర మైన మార్పు ఈ కొత్త తరం యువతులలో"
ఈ కొత్త తరం యువతులు కొంత మంది మాత్రం, పైన మనం చర్చించుకున్న ఆడదానికి వుండే గొప్ప తనాన్ని, గౌరవాన్ని మరచి, మనకి పనికి రాణి పైశాచిక పాశ్యాత్య రెప రేపలకు ఆకర్షితులై అదుపు తప్పి తునికిసలాడుతూ గృహలక్ష్ములలా మెలగాల్సిన ఈ కొత్త తరం యువతులు కొంత మంది మాత్రం, గృహలక్షుములకి బదులు గ్రహలక్షుముల వలె మనకి దర్సనమిస్త్తున్నారు.
అందుకు మనం మొత్తం మహిళా జాతిని తప్పు పట్టా రాదు కదా ? ఆ గ్రహలక్స్ములంటే మన గృహలక్షుములకి కుడా అసహ్యమే. మనమెంత ఇప్పుడు అగౌరవపరచడానికి ? ఇది అర్ధం చేసుకుని మనం ఈ రోజునుంచి మహిళలను గౌరవించడం మొదలు పెడదాము.
ఈ నా చిన్న ప్రయత్నాన్ని గృహలక్స్ములకు మాత్రమే అంకితం చేస్తూ,
ఇట్లు,
గోపి గణేష్. ఆలపాటి.